అంతర్జాతీయం

ఫ్రాన్స్‌లో నేడు 52వ G7 సదస్సు; ప్రధాని మోదీ హాజరు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఫ్రాన్స్‌లో నేడు 52వ G7 సదస్సు; ప్రధాని మోదీ హాజరు
📷 Narendra Modi / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో ఇవాళ 52వ G7 దేశాల సదస్సు ప్రారంభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధాని మోదీ వరుసగా ఏడోసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఔట్‌రీచ్ సెషన్లలో ఆయన పాల్గొంటారు.

ఈ ఏడాది సదస్సులో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చలు జరగనున్నాయి. AI సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా సురక్షితంగా విస్తరించడం, అంతర్జాతీయ ఆర్థిక అసమానతలను తగ్గించడం, సమతుల్య ఆర్థిక వృద్ధి సాధించడం వంటివి చర్చించనున్నారు.

అలాగే కీలకమైన సప్లై చైన్‌ను బలోపేతం చేయడం, ప్రపంచాన్ని వేధిస్తున్న అంతర్జాతీయ వివాదాలకు శాంతియుత పరిష్కారాలు కనుగొనడం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలపై ఉమ్మడి పోరాటం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com