హైదరాబాద్‌లో AC పేలుడు: కారణాలు, జాగ్రత్తలు ఇవే
హైదరాబాద్ మధురానగర్‌లోని విశ్వ విహార్ అపార్ట్‌మెంట్‌లో తెల్లవారు జామున రెండు గంటలకు AC పేలి మంటలు చెలరేగాయి. ఒక flat పూర్తిగా కాలిపోయింది. నగలు, నగదు, property documents, certificates అన్నీ నాశనమయ్యాయి.
ఆ flat లో నలుగురు ఉన్నారు. త్రివేణి అనే యువతి తన తల్లిదండ్రులను బయటికి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడింది. మంటలు వ్యాపించినప్పుడు ఎదురుగా ఉన్న flats కిటికీ అద్దాలు కూడా పేలిపోయాయి.
ఒక AC తో మొదలైన మంటలు మరో రెండు ACs కు, ఒక fridge కు కూడా వ్యాపించాయి. gas cylinders కూడా ఉండటంతో మంటలు మరింత తీవ్రమయ్యాయి. ఇటీవల విజయవాడ, విజయనగరంలో కూడా ఇలాంటి AC పేలుడు ఘటనలు జరిగాయి.
AC పేలుళ్లకు నిపుణులు చెప్పే ప్రధాన కారణాలు:
షార్ట్ సర్క్యూట్, condenser లో gas leakage, overload వైరింగ్ ముఖ్యమైన కారణాలు. నాసిరకం wiring వాడడం, regular servicing చేయకపోవడం కూడా ప్రమాదాలకు దారి తీస్తాయి. నిరంతరం AC వాడడం వల్ల overheat అయ్యే ప్రమాదం ఉంటుంది.
నిపుణులు సూచించే జాగ్రత్తలు:
ISI quality wiring మాత్రమే వాడాలి. AC temperature 24 నుంచి 26 డిగ్రీల మధ్య పెట్టుకోవాలి. 16 డిగ్రీలకు పెట్టడం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరం లేనప్పుడు AC off చేయాలి. ఇంట్లో fire extinguisher, smoke detector పెట్టుకోవడం మంచిది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com