వ్యాపారం

లూలు మాల్‌లో 'లూలు ఆన్ సేల్' లోగో ఆవిష్కరించిన నటుడు నందు; జులై 9 నుంచి మెగా డిస్కౌంట్లు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
లూలు మాల్‌లో 'లూలు ఆన్ సేల్' లోగో ఆవిష్కరించిన నటుడు నందు; జులై 9 నుంచి మెగా డిస్కౌంట్లు
📷 Connor Forsyth / Pexels
షేర్ కాపీ అయింది ✓

మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలోని లూలు మాల్‌లో సినీ నటుడు నందు ‘లూలు ఆన్ సేల్’ లోగోను ఆవిష్కరించారు. ఈ నెల 9 నుంచి 12 వరకు నాలుగు రోజుల పాటు మెగా సేల్ నిర్వహిస్తున్నట్టు మాల్ నిర్వాహకులు ప్రకటించారు.

ఈ సేల్‌లో 200కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులపై 50% వరకు తగ్గింపు లభిస్తుంది. లూలు హైపర్‌మార్కెట్‌లో 25,000కు పైగా ప్రొడక్ట్లపై 50% డిస్కౌంట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్, రిటైల్ స్టోర్లలోనూ స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. లూలు హ్యాపీనెస్ సభ్యులు రూ.2,999 విలువైన షాపింగ్ చేస్తే లక్కీ డ్రాలో హ్యుందాయ్ ఐ20 కారు గెలుచుకునే అవకాశం ఇస్తున్నారు.

మాల్‌లోని గేమింగ్ జోన్‌లో రూ.2,000 చెల్లిస్తే రూ.4,000 విలువైన ప్లే టైమ్, ఉచిత రైడ్లు లభిస్తాయి. రూ.3,000 ప్లస్ జస్ట్ పే చేస్తే రూ.6,000 ప్లే వాల్యూ, ఐదు రైడ్లు ఫ్రీ. రూ.5,000 పెడితే రూ.10,000 ప్లే వాల్యూ, ఏడు రైడ్లు ఉచితం. రూ.10,000, రూ.15,000 విలువైన విఐపి ఆఫర్లలో అదనపు 10% తగ్గింపు, డబుల్ ప్లే వాల్యూ, 10-12 రైడ్లు ఫ్రీగా లభిస్తాయి. భారీ తగ్గింపు కారణంగా మాల్‌ను ఉదయం 9 గంటలకే తెరుస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com