సాంకేతిక

AI స్మార్ట్ హోమ్ జిమ్: బెంగళూరు స్టార్టప్ తీసుకొచ్చిన స్మార్ట్ వర్కౌట్ మెషీన్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
AI స్మార్ట్ హోమ్ జిమ్: బెంగళూరు స్టార్టప్ తీసుకొచ్చిన స్మార్ట్ వర్కౌట్ మెషీన్
📷 Nemuel Sereti / Pexels
షేర్ కాపీ అయింది ✓

నేటి బిజీ లైఫ్‌లో ఉద్యోగం, ట్రాఫిక్ కారణంగా చాలా మంది యువత జిమ్‌కి వెళ్లడం కష్టంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ అన్ని రకాల జిమ్ సౌకర్యాలను ఒకే AI-ఆధారిత స్మార్ట్ మెషీన్‌లో పొందుపరిచింది. ఐఐటీ ఢిల్లీ నుంచి పట్టభద్రులైన అనురాగ్ దానీ, రోహిత్ పటేల్ మరియు వారి బృందం ఈ ఇన్నోవేషన్ చేపట్టారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేస్తున్న యువత కోసం దీనిని రూపొందించారు.

ఈ స్మార్ట్ హోమ్ జిమ్‌ను చిన్న స్థలంలో సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో డిజిటల్ వెయిట్ సెట్టింగ్ ఉంటుంది, దీని ద్వారా 2 కిలోల నుంచి 75 కిలోల వరకు బరువులు సర్దుబాటు చేసుకోవచ్చు. లోహపు ప్లేట్లు లేకుండానే నిజమైన వర్కౌట్ అనుభూతి ఇస్తుంది. ఈ మెషీన్‌లో 150కు పైగా వ్యాయామాలు చేయవచ్చు. వర్కౌట్ చేసే కొద్దీ మెషీన్ స్వయంగా బరువును పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. అంతేకాకుండా, మొబైల్ యాప్ ద్వారా తమ పెర్ఫామెన్స్ ట్రాక్ చేసుకోవచ్చు మరియు స్పాటర్ మోడ్ ఇండ్లో వర్కౌట్ చేసేటప్పుడు భద్రతను అందిస్తుంది. కేవలం ఒక మెషీన్ కాదు, వ్యక్తిగత స్మార్ట్ ట్రైనర్‌లా పనిచేస్తుంది. దీని ద్వారా ట్రాఫిక్, సమయం లేని వ్యక్తులు ఇంట్లోనే పూర్తిస్థాయి జిమ్ అనుభవాన్ని పొందవచ్చు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com