వాతావరణం అనుకూలించడంతో అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిన అమర్నాథ్ మంచు శివలింగ దర్శన యాత్ర తిరిగి ప్రారంభమైంది.
భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయడం, విరిగిపడిన కొండచరియలను తొలగించడం పూర్తి కావడంతో బేస్ క్యాంపుల నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రెండు యాత్రికుల బృందాలు బయలుదేరాయి.
అయితే వాతావరణం ఇంకా కొంత ప్రతికూలంగానే ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం బాల్తాల్ మార్గం ద్వారా యాత్ర కొనసాగుతోంది. పెహల్గావ్ మార్గం మాత్రం ఇంకా అనుకూలంగా లేదు. వేలాది మంది యాత్రికులు పెహల్గావ్ బేస్ క్యాంపులో సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
జూలై 3న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 28న రక్షాబంధన్ రోజుతో ముగుస్తుంది. ఇప్పటివరకు 4 లక్షల 20 వేల మందికి పైగా భక్తులు 12,750 అడుగుల ఎత్తున ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. యాత్ర ఇంకా 24 రోజులు మాత్రమే కొనసాగనుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com