ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ఏడాది పాటు నిషేధం: 100 శాంపిల్స్‌లో 85 శాతం కల్తీ
ఆంధ్రప్రదేశ్‌లో కృత్రిమ పన్నీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అధికారులు, మున్సిపల్ అధికారులతో కలిసి ఫుడ్ సెంటర్లపై తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బిర్యానీ, పన్నీర్‌లో ఎక్కువ కల్తీ జరుగుతున్నట్టు గుర్తించారు. సేకరించిన 100 పన్నీర్ శాంపిల్స్‌లో 85 శాతం కృత్రిమ పన్నీరే అని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. కల్తీ ఎక్కువగా చిన్న షాపుల్లో కాకుండా పెద్ద రెస్టారెంట్లలో జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.
ఈ నిషేధం రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు, కర్రీ పాయింట్లు, సూపర్ మార్కెట్లు, మిల్క్ పార్లర్లు, చిన్న షాపులకు వర్తిస్తుంది. 'ప్యూర్ పన్నీర్' అని చెప్పి కృత్రిమ పన్నీర్ అమ్మితే ఆయా దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేస్తారు. క్లౌడ్ కిచెన్లపైనా తనిఖీలు కొనసాగుతాయని అధికారులు చెప్పారు.
కృత్రిమ పన్నీర్‌లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇది జీర్ణకోశ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిపారు. చిన్న పిల్లల ఆరోగ్యంపైనా ఇది హాని చేకూర్చవచ్చని పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com