అరుణాచలం మోక్ష మార్గంలో మహిళ చిక్కుకుని రక్షణ; హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షణ చేస్తున్న ఒక మహిళ మోక్ష మార్గం (ఇడుక్కు పిల్లయ్యార్ గుహ)లో చిక్కుకుపోయింది. స్థానిక భక్తులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు.
మూడు రోజుల క్రితం రాజమహేంద్రవరానికి చెందిన 36 ఏళ్ల మణికుమార్ అనే భక్తుడు అదే గుహలో ఇరుక్కుని మృతి చెందాడు. వరుస ఘటనలతో అప్రమత్తమైన అధికారులు ఇప్పుడు ఊబకాయులు, వృద్ధులు ఈ మార్గంలో ప్రవేశించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
ఈ గుహ మార్గం చాలా ఇరుకైనది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగిస్తుందని భక్తులు తెలియజేస్తున్నారు. అధికారులు కూడా ముందస్తు భద్రతా చర్యలతో పాటు గుహ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com