హైదరాబాద్ 25°C
అమరావతి 31°C
IST 8:59 AM
బుధవారం ఆగస్టు 5 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన
📷 Ajay Kumar Koli / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

అయోధ్య రామమందిర నిర్మాణానికి వచ్చిన విరాళాల్లో జరిగిన ఆరోపిత చోరీపై చర్చించాలని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు నినాదాలు చేశారు. దీంతో సభ కార్యక్రమాలు కాసేపు స్తంభించాయి.

రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్ ఏర్పాటు కేంద్రం చేసిందని, భూమిపూజ నుంచి ప్రాణ ప్రతిష్ట వరకు ప్రధాని పాల్గొన్నారని, అందువల్ల ఆయనే వివరణ ఇవ్వాలన్నారు. ఈ ఆరోపణలపై ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలతో దర్యాప్తు జరిపించాలని కూడా ఖర్గే కోరారు.

అయితే ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ నేతలు అయోధ్య, రాముడిని అవమానించారని, అందుకు ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ అంశాన్ని ప్రస్తావించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలో ఇరు పక్షాల మధ్య నినాదాలు చోటుచేసుకున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com