బండి భగీరథ్‌పై BNS 64 సెక్షన్ జోడింపు; కస్టడీ పిటిషన్ దాఖలుకు పేట్ బషీరాబాద్ పోలీసులు సన్నద్ధం
POCSO కేసులో అరెస్టై చెర్లపల్లి జైల్లో రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీసులు BNS సెక్షన్ 64ని జోడించారు. ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణతో ఈ సెక్షన్ జోడించినట్లు తెలుస్తోంది.
మేడ్చల్ జడ్జ్ ముందు బాధిత యువతి మూడోసారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కొత్త సెక్షన్లు జోడించారు. జడ్జ్ ముందు సుమారు 45 నిమిషాల పాటు బాధిత యువతి మరియు ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు రికార్డు చేశారు.
పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. వారం నుంచి 10 రోజుల కస్టడీ కోరనున్నట్లు తెలుస్తోంది. భగీరథ్ వద్ద స్వాధీనం చేసుకున్న iPhone ను forensic lab కు పంపించారు. ఆ phone లో ఉన్న సమాచారం ఆధారంగా అదనపు విచారణ చేపట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
భగీరథ్‌కు సహకరించిన స్నేహితులపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతి వాంగ్మూలం ఆధారంగా పలుచోట్ల సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. స్థానిక MRO తో పంచనామా కూడా చేసినట్లు సమాచారం.
ఇప్పటివరకు ఉన్న సెక్షన్లకు 9-10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందని, కొత్తగా జోడించిన సెక్షన్లతో 10 సంవత్సరాలపైన లేదా యావజీవ శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భగీరథ్ తరపు న్యాయవాదులు ఈ నెల 21వ తేదీన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్నారు. ఆ రోజు తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపినట్లు వివరాలు అందాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com