బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ అభిమానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
చిత్ర నిర్మాత బండ్ల గణేష్, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌ను హనుమకొండలోని ఆయన నివాసంలో పరామర్శించారు. నిరంజన్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమాని.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ నిరంజన్ తల్లిదండ్రులకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ నెల 17న పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి నిరంజన్‌ను చూసి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారని, ఆయన స్ఫూర్తితోనే తాను ఈ సాయం చేస్తున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు.
నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా ఈ ఆర్థిక సాయం అందించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com