హైదరాబాద్ 25°C
అమరావతి 33°C
IST 5:35 PM
మంగళవారం జూలై 28 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మాజీ మంత్రి ఇంద్రకరణ రెడ్డి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మాజీ మంత్రి ఇంద్రకరణ రెడ్డి
📷 Gaurav Kumar / Pexels
షేర్ కాపీ అయింది ✓

తిరుమల శ్రీవారి దర్శనం కోసం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మంగళవారం విచ్చేశారు. విఐపి విరామ దర్శన సమయంలో తెలంగాణ మాజీ మంత్రి ఇంద్రకరణ రెడ్డి, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, అంబికా కృష్ణ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు.

గజల్ శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలల కోసం ప్రత్యేకంగా తెలుగు మహాసభలను డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సతీ సమేతంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి మూల విరాటును దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన కొత్త ప్రాజెక్టు ‘హైందవ’ చిత్రం షూటింగ్ గండికోటలో జరుగుతోందని, దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com