భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం; జూలై 8 నుంచి వాణిజ్య విమానాలు
ఆంధ్రప్రదేశ్‌లోని తొలి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. డీజీసీఏ తుది తనిఖీలు కొద్ది రోజుల్లో పూర్తవుతాయి.
ఇప్పటికే విమానాశ్రయంలో వాతావరణ కేంద్రం రోజువారీ బులెటిన్‌లు జారీ చేస్తోంది. ప్రతి రెండు రోజులకు ఒకసారి టెస్ట్ ఫ్లైట్లు నిర్వహిస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా పనిచేస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జూలైలో ప్రారంభోత్సవం జరగనుంది. అధికారిక షెడ్యూల్ కోసం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.
జూలై 8వ తేదీ నుంచి పూర్తి స్థాయి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థ స్కూట్ సింగపూర్‌కు తొలి సర్వీస్ నడుపుతుందని ఇప్పటికే ప్రకటించింది. దేశీయ ఎయిర్‌లైన్స్ కూడా విశాఖపట్నం ఐఎన్‌ఎస్ డేగా నుంచి తమ సేవలను భోగాపురానికి మార్చేందుకు షెడ్యూళ్లు సిద్ధం చేస్తున్నాయి.
జీఎంఆర్ గ్రూప్ పీపీపీ విధానంలో 2,200 ఎకరాల్లో సుమారు రూ.5,000 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు చివరి దశలో ఉంది. 77,000 చదరపు మీటర్ల టెర్మినల్ భవనంలో 40 చెక్-ఇన్ కౌంటర్లు, 26 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి దశలో ఏడాదికి దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రయాణికుల టికెట్లపై వసూలు చేసే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్) నిర్ణయించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com