ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్‌లో యోధురాలి పాత్రలో భూమి పెడ్నేకర్
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఇటీవల నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే, ఆమె కెరీర్‌లో మరో కీలక పాత్ర కోసం ఎంపికైంది.
దర్శకుడు సందీప్ సింగ్ రూపొందిస్తున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రంలో భూమి నటించనుంది. శివాజీ మహారాజ్‌గా కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటిస్తున్న ఈ బయోపిక్‌లో భూమి ధైర్య సాహసాలకు పేరొందిన కర్ణాటక వీర వనిత బెళవాడి మల్లమ్మ పాత్రను పోషించనుంది.
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చారిత్రాత్మక చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది. 2026 జనవరిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, రిషబ్ శెట్టి ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో కొంత ఆలస్యం కావొచ్చని సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com