హైదరాబాద్ 28°C
అమరావతి 34°C
IST 11:24 AM
సోమవారం ఆగస్టు 3 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

158 పేపర్ లీక్ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసేందుకు CBI నిర్ణయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
158 పేపర్ లీక్ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసేందుకు CBI నిర్ణయం
📷 KATRIN BOLOVTSOVA / Pexels
షేర్ కాపీ అయింది ✓

దేశవ్యాప్తంగా వివిధ నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి దాదాపు 158 పేపర్ లీక్ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయాలని సిబిఐ నిర్ణయించింది. ఈ కేసులను పార్లమెంట్ ఆమోదించిన యాంటీ పేపర్ లీక్ బిల్లు కింద కొత్తగా ఏర్పాటయ్యే ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు పంపాలని సిబిఐ భావిస్తోంది.

సిబిఐ దర్యాప్తు పూర్తైనా ఈ కేసుల్లో ఇప్పటివరకు కోర్టు విచారణ ప్రారంభం కాలేదు. వీటిలో ఢిల్లీ కోర్టుల్లో 25 కేసులు, బీహార్‌లో 5 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో కొన్ని రెండు దశాబ్దాల క్రితం నమోదైనవి కూడా ఉండడం గమనార్హం.

కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యం వల్ల న్యాయ ప్రక్రియ దెబ్బతింటుందని, సాక్షులు తరచుగా మారిపోవడం, నిందితులను గుర్తించడం కష్టం అవుతుందని సిబిఐ వర్గాలు వివరించాయి. ఈ సవాళ్లను అధిగమించేందుకు విచారణలను వేగంగా పూర్తి చేయించాలని సిబిఐ భావిస్తోంది.

ఇందుకోసం అన్ని రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించి, ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించాలని కోరనున్నట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టులకు విజ్ఞప్తి చేస్తామని సిబిఐ ప్రకటించింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com