వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ పై మెటాకు కేంద్రం నోటీసులు
కేంద్రం WhatsApp మాతృసంస్థ Meta కు యూజర్ నేమ్ ఫీచర్ పై నోటీసులు జారీ చేసింది. సైబర్ భద్రత కారణాలతో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. అప్పటివరకు ఈ ఫీచర్ ను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావద్దని స్పష్టం చేసింది.
సంబంధిత వర్గాలతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు తదుపరి నిర్ణయం తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. యూజర్ నేమ్ ఫీచర్ తో ప్రముఖులు, సంస్థల పేర్లతో నకలీ ఖాతాలు సృష్టించి మోసాలు జరిగే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం జాగ్రత్త చర్యగా ఈ నోటీసులు జారీ చేసింది.
WhatsApp ఫోన్ నెంబర్ ప్రైవసీని కాపాడేందుకు యూజర్ నేమ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఇందులో ఫోన్ నెంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం యూజర్ నేమ్ తో చాట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యూజర్లు యూజర్ నేమ్ ను రిజర్వ్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ లో 3 నుంచి 35 అక్షరాలు ఉండాలి. పెద్ద గ్రూప్ లలో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఉండటంతో ప్రైవసీకి రక్షణ లభిస్తుందని WhatsApp చెప్తోంది.
కానీ సైబర్ నిపుణులు ఈ ఫీచర్ ద్వారా నకిలీ యూజర్ నేమ్ లు సృష్టించి ప్రజలను మోసం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో మెటా వివరణ ఇచ్చే వరకు ఈ ఫీచర్ ను అమలు చేయవద్దని కేంద్రం ఆదేశించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com