చేవెళ్లలో పాత పట్వారీ కార్యాలయంలో అగ్నిప్రమాదం, రికార్డులు కాలిపోయాయి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాత పట్వారీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. చేవెళ్ల ఎంఆర్ఓ ఆఫీసు సమీపంలో ఉన్న ఈ పాత భవనంలో మంటలు చెలరేగాయి.
భవనంలో స్టోర్ చేసి ఉంచిన పాత రికార్డులు, ఇతర వస్తువులు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న షాద్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
టపాసుల నిప్పురవ్వల వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని ఎంఆర్ఓ కృష్ణయ్య తెలిపారు. కాలిపోయిన రికార్డులపై, ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పలు కేసుల డాక్యుమెంట్లు ఈ రికార్డుల్లో ఉన్నట్టు సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com