చైనాలో ఇతరుల తరఫున వాదించే పెయిడ్ సర్వీస్.. ఒక్కో కేసుకు ₹2,700 ఫీజు
చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని ఇతరుల తరఫున వాదించే సర్వీస్ ప్రారంభించాడు. ఈ పెయిడ్ ఆర్గ్యుమెంట్ సర్వీస్ కు ఒక్కో కేసుకు 188 చైనీస్ యువాన్ ఫీజు వసూలు చేస్తున్నాడు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు ₹2,600 నుంచి ₹2,700 అవుతుంది.
ఎదురుగా వెళ్లి నేరుగా వాదించడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి తరఫున ఈ వ్యక్తి వెళ్లి మాట్లాడతాడు. ఒకసారి ఫీజు చెల్లిస్తే వాదనకు ఎలాంటి టైం లిమిట్ లేదని ఆయన చెప్తున్నాడు.
సమయానికి జీతం ఇవ్వని బాస్ ను నిలదీయడం ఇతని పనుల్లో ఒకటి. ట్యూషన్ టీచర్ మారడం లేదా క్లాస్ క్యాన్సిల్ చేయడం వంటి సమస్యల్లో ఫీజు రీఫండ్ అడుగుతాడు. అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్ల తరఫున ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీసి డబ్బులు రీఫండ్ అడిగే కేసులూ తీసుకుంటున్నాడు.
ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుందని లేదా తమకు అనుకూలంగా రిజల్ట్ వస్తుందని ఇతను గ్యారెంటీ ఇవ్వడు. కేవలం కస్టమర్ తరఫున గట్టిగా నిలదీయడమే ఈ సర్వీస్ పని అని చెబుతున్నాడు.
వాదన అంటే కొట్టుకోవడం కాదని ఆయన స్పష్టం చేశాడు. మాటలు, లాజిక్ తో మాత్రమే వాదిస్తాడు. బూతులు తిట్టడం, భౌతిక దాడికి దిగడం చేయడు. చేయి చేసుకుంటే పోలీసులు కేసు పెడతారని ముందే క్లారిటీ ఇచ్చాడు. ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com