అమెరికాలో విమానయాన సంక్షోభం: రెండు రోజుల్లో 15 వేలకుపైగా విమానాలు రద్దు
అమెరికాలో FAA (Federal Aviation Administration) వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల రెండు రోజుల్లో 15 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విమాన సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరించినా రాకపోకలు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ఈ రాత్రి నాటికి సేవలు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఏ విమానం ఎప్పుడు బయలుదేరాలి, ఎక్కడ ల్యాండ్ కావాలి, గగనతలంలో విమానాల మధ్య ఎంత దూరం ఉండాలి అనేది నిర్ణయించే air traffic control వ్యవస్థలో ఈ లోపం తలెత్తింది. ఈ నియంత్రణ వ్యవస్థలో సాంకేతిక సమస్య రావడంతో ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడినట్టు విమానయాన సంస్థలు చెబుతున్నాయి.
సైబర్ దాడి లేదా ఉగ్రదాడి జరిగిందన్న అనుమానాలను అధికారులు తోసిపుచ్చారు. ఇది సాంకేతిక లోపమే అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. సైబర్ దాడి అనుమానాన్ని ఆయన ఖండించారు.
FAA వ్యవస్థ చాలా పాతదని, దాన్ని అప్గ్రేడ్ చేయకపోవడమే ఈ సమస్యకు కారణమని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. 2021, 2023 సంవత్సరాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి.
ఒకసారి విమానాలు రద్దయితే సిబ్బంది, పైలట్లు, ప్రయాణికుల షెడ్యూల్స్ అన్నీ మారిపోతాయి. అందుకే సాంకేతిక సమస్య పరిష్కారమైనా సేవలు పూర్తిగా గాడిలో పడలేదు. ఒకటి రెండు రోజుల్లో సమస్య పూర్తిగా నివృత్తమవుతుందని అమెరికా అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com