సాంకేతిక

చైనా నగరాల్లో వేడిని తగ్గించేందుకు రూఫ్‌టాప్ మిస్టింగ్ సిస్టమ్‌ల ఏర్పాటు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
చైనా నగరాల్లో వేడిని తగ్గించేందుకు రూఫ్‌టాప్ మిస్టింగ్ సిస్టమ్‌ల ఏర్పాటు
📷 MOHI SYED / Pexels
షేర్ కాపీ అయింది ✓

చైనాలోని పలు నగరాలు అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు కొత్త సాంకేతికతను అమలు చేస్తున్నాయి. షాన్సీ ప్రావిన్స్‌లోని యుంచంగ్ నగరంతో సహా అనేక చోట్ల ఎత్తైన అపార్ట్‌మెంట్ భవనాల పై కప్పులపై మిస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

ఈ వ్యవస్థలు అధిక పీడన నాజిల్‌ల ద్వారా సన్నని నీటి బిందువులను గాలిలోకి విడుదల చేస్తాయి. నీటి బిందువులు ఆవిరైపోయే సమయంలో చుట్టుపక్కల గాలి నుంచి ఉష్ణాన్ని గ్రహించి ఆ ప్రాంత ఉష్ణోగ్రతలను చల్లబరుస్తాయి. ఈ విధానాన్ని evaporative cooling (ఎవాపరేటింగ్ కూలింగ్) అంటారు.

ప్రయోగాల్లో ఈ రూఫ్‌టాప్ మిస్టింగ్ వ్యవస్థలు బయటి ఉష్ణోగ్రతలను 5 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గించినట్లు నివేదికలు చెబుతున్నాయి. నీటి బిందువులు సూక్ష్మంగా ఉండటంతో పొడి వేడి వాతావరణంలో త్వరగా ఆవిరిపోయి ప్రభావం చూపుతాయి.

చైనాలో ఈ వ్యవస్థలు కేవలం భవనాలకే పరిమితం కాలేదు. పార్కులు, బస్ స్టాప్‌లు, ఫుడ్‌పాత్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా ఇలాంటి ఓపెన్ మాయిస్చరైజింగ్ సిస్టమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా హీట్‌వేవ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో చౌకైన, పర్యావరణ అనుకూల శీతలీకరణ మార్గాల అన్వేషణలో భాగంగా చైనా ఈ సాంకేతికతను విస్తృతం చేస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com