హైదరాబాద్ 29°C
అమరావతి 30°C
IST 5:28 PM
మంగళవారం అక్టోబర్ 27 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం బ్రేకింగ్

అర్నబ్ తుఫాను: ఉప్పాడ తీరంలో భారీ అలలు, కాకినాడ రహదారి ధ్వంసం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
అర్నబ్ తుఫాను: ఉప్పాడ తీరంలో భారీ అలలు, కాకినాడ రహదారి ధ్వంసం
📷 Hemshah171095 / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అర్నబ్ తుఫాను ప్రభావంతో భారీ అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ అలల దాటికి ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే రహదారి ధ్వంసమైంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

సముద్రం సాధారణ స్థాయి కంటే దాదాపు ఐదు నుంచి ఏడు అడుగుల ఎత్తు వరకు పైకి వచ్చింది. సాధారణంగా తీరం నుంచి 10 నుంచి 20 అడుగుల దూరంలో ఉండే నీరు ఇప్పుడు తీరం వరకు చేరుకుంది. దీంతో సుమారు కిలోమీటరు మేర రోడ్డుపైకి రాళ్లు, బండరాళ్లు వచ్చాయి. విపత్తుల సమయంలో రక్షణ కోసం ఏర్పాటు చేసిన జియో-ట్యూబ్ వ్యవస్థ కూడా శిథిలావస్థకు చేరింది.

పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేసి తీర ప్రాంతానికి గ్రామస్తులు వెళ్లకుండా నిఘా ఉంచుతున్నారు. కొన్ని చోట్ల సముద్ర కోతకు ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాకినాడ జిల్లాలో వర్షాలు కూడా మొదలయ్యాయి.

కొత్తపట్నం ప్రాంతంలోని శుభంపేట, మాయపట్నం, సోరాడుపేట, జగ్గరాజుపేట గ్రామాలపై ఎక్కువ ప్రభావం ఉంది. అంతర్వేది నుంచి భైరవపాలెం వరకు దాదాపు 90 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను కేంద్రం విశాఖపట్నానికి 250 కిమీ, కాకినాడకు 300 కిమీ, మచిలీపట్నానికి 380 కిమీ, బాపట్లకు 450 కిమీ దూరంలో ఉంది. తీరంలో గంటకు 60 నుంచి 70 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

ఏపీ CM చంద్రబాబు నాయుడు తుఫాను ప్రభావంపై దృష్టి పెట్టారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలకు ₹2 కోట్లు, తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలకు ₹1 కోటి సహాయం ప్రకటించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com