దుబాయ్ భక్తులు షిర్డీ సాయికి బంగారు ‘రామ్’ అక్షరాల కానుక
మహారాష్ట్రలోని శిరిడీ సాయిబాబా ఆలయానికి దుబాయ్‌కు చెందిన భక్తులు బంగారు అక్షరాలతో ‘రామ్’ అనే శబ్దాన్ని కానుకగా అందించారు.
ఈ బంగారు అక్షరాల బరువు 76.3 గ్రాములు కాగా, వాటి విలువ సుమారు రూ.10 లక్షలు. ఆలయ అధికారులు వీటిని ద్వారకామాయిలో బాబా కొలువై ఉన్న గోడపై అమర్చారు.
ఇదే కుటుంబం కొన్ని నెలల క్రితం ‘ఓం సాయి’ అనే బంగారు అక్షరాలను కూడా ఆలయానికి సమర్పించింది. ఆ అక్షరాల బరువు 270 గ్రాములు, విలువ సుమారు రూ.24 లక్షలు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com