హైదరాబాద్ 30°C
అమరావతి 34°C
IST 2:24 PM
బుధవారం ఆగస్టు 5 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

టికెట్ రేట్ల సమస్యపై ఫిల్మ్ ఛాంబర్ కొత్తగా 9 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
టికెట్ రేట్ల సమస్యపై ఫిల్మ్ ఛాంబర్ కొత్తగా 9 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
📷 Kutay Ertürk / Pexels
షేర్ కాపీ అయింది ✓

టికెట్ రేట్ల విధానంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. గత కమిటీని రద్దు చేసిన ఛాంబర్ కొత్తగా తొమ్మిది మంది సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో సురేష్‌బాబు, సునీల్ నారా, నాగవంశీ, చదలవాడ, భరత్ భూషణ్, ప్రసన్న కుమార్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. దిల్‌రాజు, శిరీష్ లేదా మైత్రి నవీన్, రవి నుండి ఒకరు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ఇటీవల పెద్ది మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ వంటి సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చాయి. తద్వారా టికెట్ రేట్లు సాధారణంగా ఉంటేనే ప్రేక్షకులు భారీగా వస్తారని స్పష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఛాంబర్ కొత్త కమిటీతో టికెట్ రేట్ల సమస్యను లోతుగా విశ్లేషించి శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకోనుంది.

ఈ కమిటీకి ఎలాంటి సమయ పరిమితి విధించలేదు. అవసరమైనంత సమయం తీసుకుని నివేదిక ఇవ్వడానికి స్వేచ్ఛ ఇచ్చారు. ముందు ముందు బడా సినిమాలు, థియేటర్లలో ప్రేక్షకుల రద్దీని కొనసాగించాలంటే ఈ కమిటీ నిర్ణయం కీలకం కానుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com