మహారాష్ట్రలోని చిమ్మూరులో ఒకేసారి ఐదు పులులు కనిపించాయి
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చిమ్మూరులో ఒకేసారి ఐదు పులులు కనిపించాయి. ఒకే ప్రాంతంలో కలిసి సంచరిస్తున్న ఐదు పెద్ద పులులను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.
ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులులు జనావాసాలకు సమీపంలో తిరుగుతుండడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఒకే సమయంలో ఐదు పులులు కలిసి కనిపించడం అరుదైన పరిణామం. దీంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ పెంచారు.
ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com