హైదరాబాద్ 26°C
అమరావతి 34°C
IST 4:52 PM
బుధవారం ఆగస్టు 5 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు; వరదలు, కొండచరియలు విరిగిపడుతూ జనజీవనంలో అంతరాయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు; వరదలు, కొండచరియలు విరిగిపడుతూ జనజీవనంలో అంతరాయం
📷 Rohit Lokhande / Pexels
షేర్ కాపీ అయింది ✓

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతంలో చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని డెహరాడూన్ లో భారీ వర్షం కురిసింది. తంసా నది నీటిమట్టం పెరిగి తప్కేశ్వర్ మహాదేవ ఆలయం మీదుగా ప్రవహిస్తోంది. హర్యాణాలోని అంబాలాలోని జడ్జర్ ప్రాంతంలో రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది.

హిమాచల్ ప్రదేశ్ లోని నహన్ సిర్మౌర్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు సంభవించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

పంజాబ్ లోని బటిండా నగరంలో కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. బటిండా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదంజిత్ మెహతా మాట్లాడుతూ, పారిశుద్య కార్మికులు, మురుగునీటి పారుదల బోర్డు ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున నీటి తొలగింపు ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక కౌన్సిలర్లు రాత్రంతా శ్రమించినా డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.

గుజరాత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com