హైదరాబాద్ 29°C
అమరావతి 28°C
IST 2:36 PM
బుధవారం నవంబర్ 4 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ బ్రేకింగ్

హైదరాబాద్ ED దాడి: అమెరికా పౌరులను టార్గెట్ చేసిన ఫేక్ కాల్ సెంటర్ గుట్టురట్టు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్ ED దాడి: అమెరికా పౌరులను టార్గెట్ చేసిన ఫేక్ కాల్ సెంటర్ గుట్టురట్టు
📷 RDNE Stock project / Pexels
షేర్ కాపీ అయింది ✓

అమెరికా పౌరులను టార్గెట్ చేసి ఫేక్ కాల్ సెంటర్ నడుపుతున్న అంతర్జాతీయ మోసాన్ని హైదరాబాద్ ED అధికారులు బయటపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్షల్ రావల్‌తో కలిపి నలుగురిని అరెస్ట్ చేశారు.

పటియాలాలో అరెస్ట్ చేసిన వీరిని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్టు సమాచారం. హర్షల్ రావల్ మూడేళ్లుగా ఈ ఫేక్ కాల్ సెంటర్ నడుపుతున్నట్టు ED తెలిపింది. అమెరికాలో ఉంటున్న US పౌరులకు కాల్స్ చేసి, digital arrest పేరుతో భయపెట్టి డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణ ఉంది.

క్రిప్టో కరెన్సీ, క్రెడిట్ కార్డు పేరిట ఈ మోసాలు జరిగినట్టు విచారణలో తేలింది. కొన్ని వందల మ్యూల్ అకౌంట్లను ED గుర్తించింది. క్రిప్టో కరెన్సీ ద్వారా హవాలా రూపంలో డబ్బును మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. కొన్ని వేల మంది US పౌరులను మోసం చేసి, కొన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు అభియోగాలు ఉన్నాయి.

గతంలో హర్షల్ రావల్ మాదాపూర్‌లో ఫేక్ కాల్ సెంటర్ పెట్టి దొరికిపోయాడు. ఆ కేసు నమోదు తర్వాత అక్కడి నుంచి వెళ్లి పటియాలా, గుజరాత్‌లో రెండు కాల్ సెంటర్లు ఏర్పాటు చేశాడు. పటియాలాలో సుమారు 200 మంది ఉద్యోగులతో కాల్ సెంటర్ నడిపినట్టు తెలిసింది.

మోసపోయిన US పౌరుల ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వానికి అందడంతో ED వేగంగా దర్యాప్తు ప్రారంభించింది. US పౌరులకు నేరుగా లింక్ తొలిసారిగా బయటపడినట్టు ED అధికారులు చెప్తున్నారు. విచారణ కొనసాగుతోంది. ఈ కేసుపై అధికారిక ప్రకటన సాయంత్రం వరకు వెలువడే అవకాశం ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com