హైదరాబాద్ 30°C
అమరావతి 31°C
IST 2:15 PM
ఆదివారం నవంబర్ 15 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో అగ్నిప్రమాదం.. నిలిచి ఉన్న ఐదు బస్సులు కాలిబూడిద

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో అగ్నిప్రమాదం.. నిలిచి ఉన్న ఐదు బస్సులు కాలిబూడిద
📷 Mathias Reding / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లోని బౌరంపేట వద్ద నిలిచి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం ఐదు బస్సులు కాలిబూడిద అయ్యాయి.

బొడ్డరాయి సమీపంలో డుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మంటలు రేగినట్టు సమాచారం. బస్సులు పక్కపక్కనే పార్క్ చేసి ఉండటంతో మంటలు ఒక బస్సు నుంచి మరో బస్సుకు వేగంగా వ్యాపించాయి.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు రేగి ఉంటాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

డుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com