హైదరాబాద్ విద్యార్థి ఫిన్లాండ్‌లో మిస్సింగ్; 45 రోజులుగా ఆచూకీ లేదు
హైదరాబాద్‌లోని వనస్థలిపురం, వైదేహి నగర్‌కు చెందిన విద్యార్థి మణిదీప్ రెడ్డి ఫిన్లాండ్‌లో మిస్సింగయ్యారు. 45 రోజులు గడిచినా ఆయన ఆచూకీ లభించలేదు.
మణిదీప్ రెడ్డి లాత్తిలోని ఎల్యూటు యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. గత మే 4న చివరిసారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్‌గా ఉంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఫిన్లాండ్‌లోని స్నేహితులకు సమాచారం ఇచ్చారు. వారు ఆయన రూమ్, కాలేజీలో వెతికినా ఆచూకీ లభించలేదు.
వెంటనే ఫిన్లాండ్ పోలీసులకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తల్లిదండ్రులు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి సహాయం అభ్యర్థించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తన కొడుకును వెతికించి, సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
45 రోజులు గడిచినా ఎలాంటి సమాచారం రాకపోవడంతో కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలేదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com