హైదరాబాద్ 26°C
అమరావతి 32°C
IST 2:55 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

పీఓకేను ‘పాకిస్తాన్ కాశ్మీర్’గా పేర్కొన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పీఓకేను ‘పాకిస్తాన్ కాశ్మీర్’గా పేర్కొన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం
📷 Rajneesh Narula / Pexels
షేర్ కాపీ అయింది ✓

న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ‘పాకిస్తాన్ కాశ్మీర్’ అని పేర్కొనడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అమెరికాలోని భారత రాయభార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఆ ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని, అది పాకిస్తాన్ కాశ్మీర్ కాదని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్, లద్దాక్ ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో భాగంగా ఉంటాయని కూడా తెలిపింది.

‘స్థానిక ఎన్నికల వేళ పాకిస్తాన్ కాశ్మీర్‌లో ఘర్షణలు’ అనే శీర్షికతో ఈ కథనం ప్రచురితమైంది. ఇందులో మీర్‌పూర్ ప్రాంతంలో పోలీసుల తీరుపై జరిగిన నిరసనలను ప్రస్తావించింది.

భారత విదేశాంగ శాఖ ఈ నిరసనలను పాకిస్తాన్ సాగిస్తున్న వ్యవస్థాగత దోపిడికి, పరిపాలనాపరమైన అణచివేతకు నిదర్శనంగా పేర్కొంది. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చడానికి పాకిస్తాన్ స్థానిక ఎన్నికల నాటకాన్ని ప్రదర్శిస్తోందని తెలిపింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com