ఇతర క్రీడలు

మాంచెస్టర్‌లో భారత్ vs ఇంగ్లాండ్ 2వ T20 మ్యాచ్ నేడు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మాంచెస్టర్‌లో భారత్ vs ఇంగ్లాండ్ 2వ T20 మ్యాచ్ నేడు
📷 cottonbro studio / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఐర్లాండ్‌తో సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు మాంచెస్టర్‌లో నేడు జరిగే రెండో T20 మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

భారత జట్టులో ఓపెనర్ సంజూ శాంసన్ వరుసగా మూడు మ్యాచుల్లో నిరాశపరిచాడు. ఈ టూర్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు. T20 వరల్డ్ కప్‌లో Player of the Tournament గా నిలిచిన శాంసన్ ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అయితే జట్టు నిర్వహణ ఆయనపై నమ్మకం ఉంచి మరో అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉంది.

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం తీవ్రమైన చర్చకు దారితీసింది. శాంసన్ మళ్ళీ వైఫలమైతే వైభవ్‌కు అవకాశం వచ్చే అవకాశం ఉంది. అలాగే తిలక్ వర్మ స్లో బౌలింగ్‌తో ఇబ్బంది పడటం, మధ్య ఓవర్లలో నెమ్మదిగా ఆడడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో Finisher గా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

మరో ఓపెనర్ అభిషేక్ మాత్రం మంచి ఫారమ్‌లో ఉన్నాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ Half Century తో ఫారమ్‌లోకి రావడం సానుకూల అంశం. బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండవని భావిస్తున్నారు. ముగ్గురు Spinners తో భారత జట్టు బరిలోకి దిగనుంది.

ఇంగ్లాండ్ ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్‌కు దూరమైన పేసర్ Archer ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. George Tang అరంగేట్రం చేయనున్నాడు. Mahmood మరియు Luke Wood లను జట్టు నుండి తప్పించారు. ఓపెనర్లు Salt మరియు Buttler మెరుపు ఆరంభం అందిస్తే, మిడిల్ ఆర్డర్‌లో Brook మరియు Will Jacks తో భారీ స్కోర్ సాధించాలని ఇంగ్లాండ్ లక్ష్యంగా పెట్టుకుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com