హైదరాబాద్‌లో ఈ నెల 19-22 వరకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్: మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
హైదరాబాద్‌లో ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19న కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల రోడ్లు భవనాల శాఖల మంత్రులు, దేశ విదేశాల నిపుణులు హాజరవుతారని ఆయన తెలిపారు.
ఐఆర్సి ఏర్పాట్లను ప్రపంచ స్థాయిలో చేయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సంస్కృతి, ప్రగతిని చాటే విధంగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఐఆర్సిపై విస్తృత ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరులో హోర్డింగ్లు, ఆడియో, వీడియో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ముందస్తు సదస్సుల్లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఉండాలని ఆయన సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com