హైదరాబాద్ 29°C
అమరావతి 28°C
IST 4:20 PM
శుక్రవారం నవంబర్ 13 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌లో భారీ మంచు.. పర్యాటకుల రద్దీ పెరుగుతోంది

రచన: ఉషా కిరణం డెస్క్ ·
జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌లో భారీ మంచు.. పర్యాటకుల రద్దీ పెరుగుతోంది
📷 versolaluce / Pexels
షేర్ కాపీ అయింది ✓

జమ్మూ కాశ్మీర్ ఎగువ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. గుల్మార్గ్, సోనామార్గ్, గురేజ్, కుఫారా వంటి పర్యాటక కేంద్రాలు మంచుతో నిండిపోయాయి.

దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ మొగల్ రోడ్ పరిసరాలు కూడా తెల్లగా మారాయి. ఇళ్ల పైకప్పులు, రహదారులపై అడుగుల మేర మంచు పేరుకుపోతోంది.

జోజిలా పాస్ వద్ద భారీగా మంచు చేరడంతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జిల్లా లాహోల్ స్పితి, మనాలి ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో పలు రహదారులను మూసివేసి పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. మనాలిలోని గులాబా దాటి వాహనాలను అనుమతించడం లేదు.

ఢిల్లీ NCRలోని వాయు కాలుష్యం నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు ఇప్పటికే హిమాచల్‌కు వస్తున్నారు. తాజా మంచుతో పర్యాటకుల రద్దీ మరింత పెరుగుతుందని హిమాచల్ పర్యాటక రంగం ఆశిస్తోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com