హైదరాబాద్ 29°C
అమరావతి 29°C
IST 4:23 PM
గురువారం నవంబర్ 12 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం
📷 Esra Afşar / Pexels
షేర్ కాపీ అయింది ✓

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రంలో తుఫాను ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి, 14న డిప్రెషన్‌గా, 15న డీప్ డిప్రెషన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గల్ఫ్ ఆఫ్ మన్నార్ సమీపంలో సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో మరో తుఫాను ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com