పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు: యూట్యూబర్ బొజ్జ ఐశ్వర్య ఇంటి ముందు జనసేన మహిళా కార్యకర్తల నిరసన
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ బొజ్జ ఐశ్వర్య (ప్రశ్న రావణ్) ఇంటి ముందు జనసేన మహిళా కార్యకర్తలు రాత్రి నుంచి నిరసన తెలుపుతున్నారు.
కాకినాడలోని ఆమె నివాసం వద్దకు వచ్చిన మహిళలు, ఆమె వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సర్పవరం, పిఠాపురం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేసినట్లు నిరసనకారులు తెలిపారు.
ఐశ్వర్య మాత్రం క్షమాపణ చెప్పేది లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు విడుదల చేశారు. ఆమె ప్రస్తుతం ఇంటి వద్ద లేకుండా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారని, అక్కడి నుంచి మరో వీడియో పోస్ట్ చేశారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు ఆమెను మరిన్ని వీడియోలు పెట్టొద్దని కోరినా మళ్లీ పోస్ట్ చేయడంతో నిరసన తీవ్రతరం అయింది. బొజ్జ ఐశ్వర్యను అరెస్టు చేసి క్షమాపణ చెప్పించే వరకు తాము అక్కడి నుంచి కదలమని జనసేన మహిళా కార్యకర్తలు పేర్కొంటున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com