తెలంగాణ

నిజామాబాద్ ఇటుక బట్టీల్లో బాండెడ్ లేబర్: జడ్జి భారతలక్ష్మి ఆకస్మిక తనిఖీ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నిజామాబాద్ ఇటుక బట్టీల్లో బాండెడ్ లేబర్: జడ్జి భారతలక్ష్మి ఆకస్మిక తనిఖీ
📷 prasun_16 . / Pexels
షేర్ కాపీ అయింది ✓

నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి ఆర్మూరు, ఆలూరు మండలాల్లోని ఇటుక బట్టీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేగం, మగ్గిడి గ్రామాల్లో కార్మికులను బలవంతంగా పని చేయిస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఆమె స్వయంగా వెళ్లి పరిశీలించారు.

ఒక కార్మికుడు బట్టీ నుంచి తప్పించుకుని హైదరాబాద్ లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించాడు. అక్కడ అతని వీడియో స్టేట్‌మెంట్ నమోదు చేసిన తర్వాత జిల్లా జడ్జికి ఆదేశాలు వచ్చాయి. కార్మికులకు తెల్లవారు జామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు విశ్రాంతి లేకుండా పనులు చేయిస్తున్నారని, కూలీ కూడా చాలా తక్కువగా ఇస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. వసతి సౌకర్యాలు కూడా కల్పించడం లేదని తెలిపారు.

జిల్లా జడ్జి భారతలక్ష్మి కార్మిక, రెవెన్యూ, పోలీస్ అధికారులను కార్మికులకు వెంటనే న్యాయ సహాయం అందించాలని ఆదేశించారు. బట్టీల్లో ఉన్న బాండెడ్ లేబర్ అందరినీ rescue చేయాలని, వారికి bonded labour free certificates ఇప్పించాలని, పని చేసిన రోజులకు పూర్తి వేతనం మరియు compensation చెల్లించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఆర్మూరు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి, న్యాయ సేవ అధికారులు కూడా పాల్గొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com