కర్నూలు: అరుదైన వాస్క్లర్ సర్జరీ కోసం రూ.12 లక్షల ఆర్థిక సహాయం కోరిన కుటుంబం
కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి అరుదైన వాస్క్లర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు పొట్ట భాగంలో ప్రధాన రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోవడంతో వెంటనే వాస్క్లర్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు.
ఈ ఆపరేషన్ కోసం సుమారు రూ.12 లక్షలు ఖర్చవుతుందని తెలిసింది. ఇప్పటికే రూ.6 లక్షలు అప్పు చేసి చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోవడంతో, కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
విజయ్ కుమార్ భార్య మారెయమ్మ ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్‌ను వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా ప్రభుత్వపరంగా సహాయం అందించి, తన భర్తకు వైద్యం చేయించాలని కోరారు. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఒక సంవత్సరంగా భర్త సరిగా ఆహారం తీసుకోలేక పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై మంత్రి లేదా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com