కర్ణాటకలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ: 12 కొత్త మంత్రులు, 8 మంది యదాతదం
కర్ణాటక ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా 12 మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పటికే ఉన్న 8 మంది మంత్రులను యధాతదంగా కొనసాగించారు. దీంతో మొత్తం 20 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది.
అదేవిధంగా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా GS పాటీల్, డిప్యూటీ స్పీకర్‌గా పొన్నన్న నియమితులయ్యారు. కొత్త మంత్రివర్గం సాయంత్రం 4 గంటలకు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనుంది.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంలో వేగవంతమైన చర్యల కోసం ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com