జాతీయం బ్రేకింగ్

కర్ణాటక CM సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కర్ణాటక CM సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం
📷 Ranjeet Chauhan / Pexels
షేర్ కాపీ అయింది ✓

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తావర్చంద్ గహలాత్ ఆమోదించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.

సిద్దరామయ్య నిన్న మధ్యాహ్నం గవర్నర్‌ను కలవడానికి వెళ్లారు. అయితే గవర్నర్ అకస్మాత్తుగా బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్ వెళ్లారు. దాంతో సిద్దరామయ్య తన రాజీనామాను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రభుశంకర్‌కు అందజేశారు. నిన్న రాత్రే గవర్నర్ బెంగళూరు తిరిగివచ్చారు. ఈ రోజు ఉదయం రాజీనామాను పరిశీలించి ఆమోదించారు.

తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం డీకే శివకుమార్ పేరు ముందుంది. రాజీనామా తర్వాత సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో జైపూర్ వెళ్లి ఈ రోజు తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.

ఈ రోజు వారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కలవనున్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పు, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన ఢిల్లీ నుంచి వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com