తెలంగాణ

హైదరాబాద్‌కు మూడు బుల్లెట్ రైలు ప్రాజెక్టులు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్‌కు మూడు బుల్లెట్ రైలు ప్రాజెక్టులు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
📷 Batthini Vinay Kumar Goud / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌కు మూడు బుల్లెట్ రైలు ప్రాజెక్టులు రానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైలు ప్రాజెక్టులను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో మూడింటిని హైదరాబాద్ కేటాయించినట్లు చెప్పారు.

మంత్రి ప్రకటన ప్రకారం, హైదరాబాద్ నుంచి ముంబై, గోవా, బెంగళూరు, చెన్నైకి హైస్పీడ్ రైలు కారిడార్లు ప్రతిపాదించారు.

ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాథమికంగా రూ.5 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. అయితే, భూసేకరణ ధరలు పెరుగుతుండడంతో మొత్తం వ్యయం రూ.10 లక్షల కోట్లకు చేరవచ్చని కిషన్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం ఈ మార్గాలకు సర్వే జరుగుతోందని, డీపీఆర్ పూర్తయిన తర్వాత టెండర్లు పిలిచి వేగంగా పనులు ప్రారంభిస్తామన్నారు. నిధుల సమీకరణకు కేంద్రం ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసిందని వివరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com