హైదరాబాద్ 28°C
అమరావతి 34°C
IST 11:10 AM
సోమవారం ఆగస్టు 3 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

లష్కర్ బోనాల ఉత్సవం: ఉజ్జైని మహంకాలి ఆలయంలో భక్తుల పోటెత్తుడు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
లష్కర్ బోనాల ఉత్సవం: ఉజ్జైని మహంకాలి ఆలయంలో భక్తుల పోటెత్తుడు
📷 Ravi Kant / Pexels
షేర్ కాపీ అయింది ✓

సికింద్రాబాద్ లోని ఉజ్జైని మహంకాలి అమ్మవారి లష్కర్ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

తెల్లవారుజాము 3 గంటలకు ఆలయం తెరిచారు. 4 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ తర్వాత భక్తుల దర్శనం ప్రారంభించారు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రాణిగంజ్, రామగోపాల్పేట, జనరల్ బజార్ నుంచి వేర్వేరు మార్గాల్లో భక్తులు వస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు గంట నుంచి గంటన్నర సమయం పట్టింది.

బాల్కంపేట, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బోనాలు సమర్పించారు. ఆలయ నిర్వాహకులు, పోలీసులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని భక్తులు చెప్పారు. ఒక భక్తుడు మాట్లాడుతూ, 'ఈసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. పోలీసులు చాలా మంచిగా సహకరించారు' అని అన్నారు.

అర్ధరాత్రి 12 గంటల వరకు దర్శనం కొనసాగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రేపు ఉదయం ప్రత్యేక పూజలు, రంగం, అంబారి ఊరేగింపు, అనంతరం రాత్రి ఘటాల ఊరేగింపు ఉంటుంది. 12 గంటల లోపు క్యూలో వచ్చే ప్రతి భక్తుడికీ దర్శనం కల్పిస్తామని అధికారులు చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com