హైదరాబాద్ 29°C
అమరావతి 32°C
IST 2:23 PM
శుక్రవారం ఆగస్టు 7 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూళ్లకు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూళ్లకు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
📷 Sharath G. / Pexels
షేర్ కాపీ అయింది ✓

యూపీఐ, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలపై ఛార్జీలు విధించే బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, ఎలాంటి విస్తృత చర్చ లేకుండానే ఆమోదం లభించింది.

టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (సవరణ) బిల్లు 2026లో భాగంగా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లో సవరణలు చేశారు. ఇప్పటివరకు యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదని నిర్దేశించిన సెక్షన్ 10A నిబంధనను తొలగించారు. దీంతో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు యూపీఐ, నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) రూపంలో ఛార్జీలు విధించవచ్చు.

అయితే, ఏ డిజిటల్ పేమెంట్ విధానాలను ఉచితంగా ఉంచాలనేది ప్రభుత్వమే నోటిఫికేషన్ ద్వారా నిర్ణయిస్తుంది. కాబట్టి యూపీఐ సహా కొన్ని పేమెంట్ మార్గాలు ప్రస్తుతం ఉన్నట్టుగానే ఉచితంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం తదుపరి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఇదే బిల్లులో మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పీసీలు, సర్వర్లు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కోసం విదేశీ కంపెనీలకు సరఫరా చేసే కాంట్రాక్ట్ తయారీదారులకు 2041 వరకు ఆదాయ పన్ను మినహాయింపు పొడిగించారు. భారతీయ డేటా సెంటర్లను వాడుకునే విదేశీ క్లౌడ్ కంపెనీలకు ముందస్తు అనుమతి, నోటిఫికేషన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ, డేటా సెంటర్లను లీజుకు తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com