మహబూబాబాద్: ఉపాధి కూలీలకు Face Recognition యాప్ తిప్పలు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లిలో ఉపాధి హామి పనికి వచ్చిన కూలీ మాల్యాల శ్రీనివాస్, హాజరు నమోదు చేసుకోవడానికి వింత పద్ధతిని అనుసరించాల్సి వచ్చింది.
శ్రీనివాస్ కొంతకాలం క్రితం తలకు గుండు చేయించుకున్నాడు. దీంతో ఉపాధి హామి హాజరు కోసం వినియోగిస్తున్న Face Recognition యాప్ అతని ముఖాన్ని గుర్తుపట్టలేదు. హాజరు నమోదు కోసం పక్కనే ఉన్న మహిళ జుట్టును తన తలపై పెట్టుకుని ఫోటో దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత యాప్ అతని హాజరును నమోదు చేసింది.
ఈ సంఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. గుండు చేయించుకుంటే హాజరు పడకపోవడమేమిటని కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎండలకు చర్మం రంగు మారడం వల్ల కూడా యాప్ ముఖాన్ని గుర్తుపట్టడం లేదని కొందరు కూలీలు చెప్తున్నారు. దీంతో పౌడర్ పూసుకుని ఫోటో దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు వివరించారు.
సాంకేతిక లోపాలను సరిదిద్ది యాప్ ఇబ్బందులు తొలగించాలని, ఉపాధి హామి హాజరు విధానంలో మార్పులు చేయాలని కూలీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com