హైదరాబాద్ 26°C
అమరావతి 31°C
IST 8:54 PM
బుధవారం ఆగస్టు 5 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌లో అనలాగ్ పన్నీర్ నిషేధం; మరణిస్తే జీవిత ఖైదు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌లో అనలాగ్ పన్నీర్ నిషేధం; మరణిస్తే జీవిత ఖైదు
📷 Sora Shimazaki / Pexels
షేర్ కాపీ అయింది ✓

మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ ప్రభుత్వాలు అనలాగ్ పన్నీర్ ఉత్పత్తి, విక్రయాలపై నిషేధం విధించాయి. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి తయారు చేస్తే ఆరు నెలల జైలు, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. అనలాగ్ పన్నీర్ తినడం వల్ల ఎవరైనా మరణిస్తే, జీవిత ఖైదుతో పాటు పది లక్షల రూపాయల జరిమానా ఉంటుందని ఆ ప్రభుత్వం తెలిపింది.

అనలాగ్ పన్నీర్ అనేది పాలతో తయారు చేసే పన్నీర్ కాదు. దీన్ని పామ్ ఆయిల్ లేదా వెజిటబుల్ ఆయిల్, స్టార్చ్, పాలపొడి, స్టెబిలైజర్లు, ఫ్లేవరింగ్ ఏజెంట్లతో తయారు చేస్తారు. చూడటానికి ఒరిజినల్ పన్నీర్ లాగే ఉండి, ధర కూడా తక్కువగా ఉంటుంది. అయితే ఇది నాన్-డైరీ ప్రొడక్ట్ అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనలాగ్ పన్నీర్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ ధరకు లభించే ఈ పన్నీర్ను రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడుతున్నారు. కాబట్టి చౌకగా దొరికే పన్నీర్ ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

నకిలీ పన్నీర్ను గుర్తించడానికి కొన్ని సింపుల్ పరీక్షలు ఉన్నాయి. రంగు మారుతూ ఉంటే, ముదురు పసుపు రంగులో ఉంటే, రబ్బర్‌లా సాగితే, పుల్లటి వాసన వస్తే అది కల్తీదే. నీళ్లలో వేస్తే ఒరిజినల్ పన్నీర్ మునుగుతుంది. కల్తీ పన్నీర్ కరిగిపోతుంది. ఫ్రై చేస్తే కూడా నకిలీ పన్నీర్ కరిగిపోతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే స్వచ్ఛమైన పన్నీర్ని గుర్తించవచ్చు.

వీలైతే ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకోవాలని, బయట కొనాల్సి వస్తే నమ్మకమైన బ్రాండెడ్ పన్నీర్నే ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com