సోమవారం ఉదయం డల్ గా అనిపించడం ఎందుకు? నిపుణులు చెప్పిన పరిష్కారాలు
సోమవారం ఉదయం చాలా మందికి అలసట, చిరాకు, ఒత్తిడి అనిపిస్తాయి. దీన్ని Monday Morning Blues అంటారు. మానసిక నిపుణులు దీనికి కొన్ని కారణాలు వివరించారు.
వీకెండ్ లో రెండు రోజులు విశ్రాంతిగా గడిపిన తర్వాత మళ్లీ పని, office targets గుర్తుకు రావడం ఒక కారణం. ఆదివారం రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం కూడా ముఖ్యమైన కారణమే. ఫోన్లు చూడడం, సినిమాలు చూడడం, బయట తిరగడం వల్ల నిద్రపోయే సమయం మారిపోతుంది. దీంతో శరీరం సాధారణ routine కు మళ్లీ అలవాటు పడలేక డల్ గా అనిపిస్తుంది.
సోమవారం meetings ఉంటాయని, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ముందే భయపడటం కూడా ఈ అనుభవాన్ని పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు.
కొన్ని చిన్న అలవాట్లు పాటిస్తే Monday Blues తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం రాత్రి మరుసటి రోజు పనులను సింపుల్ గా plan చేసుకోవాలి. సోమవారం ఉదయం లేచిన వెంటనే mobile చూడకుండా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండాలి. వ్యాయామం, yoga, walking చేస్తే శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. ఇష్టమైన music వింటే మూడ్ మారుతుంది. protein నిండిన breakfast తీసుకుంటే రోజంతా చురుగ్గా ఉండవచ్చు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com