వాతావరణం

ముంబైలో భారీ వర్షాలు: 20 సెం.మీ. వర్షపాతం, వరదలు, రెస్క్యూ చర్యలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ముంబైలో భారీ వర్షాలు: 20 సెం.మీ. వర్షపాతం, వరదలు, రెస్క్యూ చర్యలు
📷 Mr.Rabindra Bagh / Pexels
షేర్ కాపీ అయింది ✓

ముంబై నగరంలో నిన్న కుండపోత వర్షాలు కురిశాయి. 12 గంటల వ్యవధిలో నగరంలోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు విరిగిపడటం, రోడ్లు కుంగిపోవడం, ఇల్లు కూలిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

వర్ష బీభత్సం నేపథ్యంలో అధికారులు వెంటనే రెస్క్యూ చర్యలు చేపట్టారు. 10 వేల మందికి పైగా రిస్క్ సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. 448 డీ వాటరింగ్ పంపులు, 19 మినీ పంపింగ్ స్టేషన్లు నిరంతరం పని చేస్తున్నాయని వెల్లడించారు.

ముంబై శివార్లలోని పాల్గర్ జిల్లాలోనూ భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. వరదనీటిలో కొట్టుకుపోయి ఆరేళ్ల చిన్నారి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న 180 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పుణే జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

ఇవాళ కూడా ముంబై, పాల్గర్, పుణే జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com