పెద్ది సినిమాను అడ్డుకుంటే ఆమరణ నిరాహార దీక్ష: నిర్మాత నట్టికుమార్ హెచ్చరిక
నిర్మాత నట్టికుమార్ తెలంగాణ ఎగ్జిబిటర్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ది సినిమా విడుదలను అడ్డుకునేందుకు ఎగ్జిబిటర్లు కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
తెలుగు ఫిలిం చాంబర్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని నట్టికుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించట్లేదని, కానీ పెద్ది సినిమా రిలీజ్‌పై ఒప్పందం నిలబెట్టుకోవాలని అన్నారు.
ఫిలిం డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు పెద్ది సినిమా రిలీజ్‌కు line clear అని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని నట్టికుమార్ కోరారు. మే 25–26 నైట్ లోపు సమస్య పరిష్కారం కాకపోతే, బుధవారం ఉదయం 10 గంటలకు తెలుగు ఫిలిం చాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com