అసోం వరద బాధితులకు NTR చారిటబుల్ ట్రస్ట్ సహాయం
హైదరాబాద్‌లోని NTR చారిటబుల్ ట్రస్ట్ అసోం వరద బాధితులకు సహాయం అందించింది. ఆహార పదార్థాలు, బట్టలు వంటి నిత్యవసర వస్తువులతో నిండిన ట్రక్కును ట్రస్ట్ అసోంకు పంపింది.
ఫిల్మ్ చాంబర్ ఆవరణ నుంచి ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు నందమూరి మోహనకృష్ణ ఆధ్వర్యంలో ఈ ట్రక్కును పంపారు. అసోంలో భారీ వర్షాలకు వరదలు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అక్కడి ప్రజలను ఆదుకోవాలని Embiris అనే సంస్థ చేసిన విజ్ఞప్తి మేరకు ట్రస్ట్ స్పందించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి సేకరించిన విరాళాలు ఊహించిన దానికంటే ఎక్కువగా లభించాయని మోహనకృష్ణ తెలిపారు. సేకరించిన సామగ్రిని ఈరోజు అసోంకు పంపినట్టు ఆయన చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com