నకిలీ దాడి నాటకం బట్టబయలు — పాస్టర్ అభినయ దర్శన్‌కు చిక్కులు
కడప జిల్లాకు చెందిన పాస్టర్ అభినయ దర్శన్‌పై అల్లూరి సీతారామరాజు జిల్లా GK విధి మండలంలో దాడి జరిగిందనే ప్రచారం అబద్ధమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
తన కారుపై దాడి చేసినట్లు, తనను హత్య చేయడానికి ప్రయత్నించినట్లు కొందరు వ్యక్తులతో నటింపచేసి, ఆ దృశ్యాలను చిత్రీకరించారని పోలీసులు పేర్కొన్నారు. ఆ వీడియోలను Facebook, YouTube మరియు ఇతర social media వేదికల్లో వ్యాప్తి చేసి హత్యాయత్నం జరిగిందని అభినయ దర్శన్ ప్రచారం చేసుకున్నారు.
ఎక్కడ నటించాలి, ఎలా నటించాలి, సన్నివేశం ఎలా సృష్టించాలి అనే అంశాలను అభినయ దర్శన్ ముందే సంబంధిత వ్యక్తులకు చెప్పారని పోలీసులు తెలిపారు. నటించినందుకు కొందరికి డబ్బులు చెల్లించారని PhonePe చెల్లింపు వివరాలు బయటపెట్టారు.
ఈ నాటకం 24 గంటల్లోనే పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది. ప్రభుత్వంపై అపప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ డ్రామాను పన్నారని పోలీసులు పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com