హైదరాబాద్ 26°C
అమరావతి 31°C
IST 9:12 AM
ఆదివారం ఆగస్టు 9 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

IIT ఢిల్లీ స్నాతకోత్సవంలో PM మోడీ: 'జీవితంలో అన్నీ out of syllabus'

రచన: ఉషా కిరణం డెస్క్ ·
IIT ఢిల్లీ స్నాతకోత్సవంలో PM మోడీ: 'జీవితంలో అన్నీ out of syllabus'
📷 Narendra Modi / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ ఐఐటీ 57వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 3000 మందికి పైగా గ్రాడ్యుయేట్లకు డిగ్రీ పట్టాలు అందజేశారు. పిహెచ్డి చేసిన 587 మంది అభ్యర్థులు కూడా ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు అందుకున్నారు.

ప్రసంగంలో మోడీ క్యాంపస్ జీవితానికి, బయట జీవితానికి చాలా తేడా ఉంటుందని చెప్పారు. క్యాంపస్లో పరీక్షలకు సిలబస్ ఉంటుందని, కానీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు అన్నీ ‘out of syllabus’ లాగా ఉంటాయని వ్యాఖ్యానించారు. మార్పు సమయంలో సవాళ్లు, అవకాశాలు రెండూ వస్తాయని, భయపడకూడదని సూచించారు.

నిత్య విద్యార్థిగా నిరంతరం నేర్చుకునే వారే విజయం సాధిస్తారని, ‘నేర్చుకునే వాడు గెలుస్తాడు’ అని మోడీ అన్నారు. ప్రశ్నించడంతో పాటు సమస్యలకు పరిష్కారం వైపు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

అనంతరం సోనీపట్లోని ఐఐటీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ‘పరమ్ ప్రజ్ఞ’ అనే AI ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని మోడీ వర్చువల్గా ప్రారంభించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com