ఫౌజీ షూటింగ్ పూర్తి చేసి, స్పిరిట్ షెడ్యూల్‌లో చేరనున్న ప్రభాస్
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా షూటింగులో బిజీగా ఉన్న నటుడు ప్రభాస్.. ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 'స్పిరిట్' తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాకముందే, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
చిత్ర వర్గాల సమాచారం ప్రకారం.. 'ఫౌజీ' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో త్వరగా ఈ సినిమాను ముగించి, ఆ తర్వాత మళ్లీ 'స్పిరిట్' సినిమాలో జాయిన్ అవ్వాలని ప్రభాస్ భావిస్తున్నారు.
'ఫౌజీ' ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని, సమయానికి సిద్ధం చేయాలనే పట్టుదలతో ప్రభాస్ ఉన్నారని సమాచారం. గతంలో ఈ సినిమా దసరాకు విడుదల కానుందని ప్రచారం జరిగింది.
ఇక 'ఫౌజీ' తర్వాత 'స్పిరిట్'పై ఫోకస్ చేస్తారని, ఆ తర్వాత 'కల్కి 2' చిత్రంలోనూ నటించనున్నారని తెలుస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com