Dragon తర్వాత Salaar 2 తెరకెక్కిస్తా: దర్శకుడు Prashanth Neel
దర్శకుడు Prashanth Neel, Dragon పూర్తయిన వెంటనే Salaar 2 తెరకెక్కిస్తానని స్పష్టం చేశాడు. Salaar కథకు ముగింపు ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని, అందరి అంచనాలు అందుకునే విధంగా రెండో భాగం ఉంటుందని ఆయన చెప్పాడు.
Dragon teaser విడుదలైన తర్వాత నటుడు Prabhas అభిమానులు సోషల్ మీడియాలో Salaar 2 అప్‌డేట్ కోసం గోల చేశారు. Prashanth Neel mythology project గురించి, కొత్త సినిమాల గురించి చెప్తున్నారు కానీ Salaar sequel గురించి మాట్లాడడం లేదని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
KGF, KGF: Chapter 2 చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. అయితే 2023లో విడుదలైన Salaar ₹1,000 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకోలేకపోయింది. రెండో భాగంలో ఆ లోటు తీర్చే విధంగా కథను తీర్చిదిద్దాలని Prashanth Neel భావిస్తున్నాడు.
Dragon షూటింగ్ పూర్తయి, అన్నీ కుదిరితే వచ్చే ఏడాది నుంచే Salaar 2 సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com